News August 30, 2025

మంచి స్పాన్సర్ కోసం BCCI ఎదురుచూపు!

image

టీమ్ ఇండియా స్పాన్సర్‌గా డ్రీమ్ 11 తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం వేట మొదలుపెట్టింది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉండే స్పాన్సర్ కోసం బోర్డు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కొంత సమయం పట్టనుండటంతో జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌లో భారత జట్టును ఆడించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. సరైన స్పాన్సర్ దొరికే వరకు వేచి చూడాలనే ధోరణిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News August 30, 2025

రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల స్థానమిదే..

image

దేశంలో 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే 1.72 లక్షల మంది మరణించగా, 4.62 లక్షల మంది గాయపడ్డారని కేంద్ర నివేదిక వెల్లడించింది. 2022తో పోలిస్తే ప్రమాదాలు 4.1%, మరణాలు 2.61% పెరిగాయని పేర్కొంది. రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాల్లో ఏపీ(8,276), TG(8,103) ఏడు, ఎనిమిది స్థానాల్లో, మరణాల్లో AP(3,806), తెలంగాణ(3,508) 8, 9 స్థానాల్లో ఉన్నాయి. మరణాల్లో అత్యధికం 35-45 ఏళ్ల వారే ఉన్నారని తెలిపింది.

News August 30, 2025

ఈ ఏడాది చివర్లో నంది అవార్డులు: మంత్రి దుర్గేశ్

image

AP: తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో నంది అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. విశాఖలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. గిడుగు రామమూర్తి, గురజాడ, కందుకూరి కృషి ఫలితంగానే తెలుగు భాషకు మహోన్నత స్థానం లభించిందని చెప్పారు. ఈ క్రమంలో రామమూర్తి అవార్డు గ్రహీతలను సత్కరించి, అవార్డులు, నగదు అందజేశారు.

News August 30, 2025

సింధు ఓటమి.. సాత్విక్ జోడీపైనే ఆశలు

image

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మెన్స్ డబుల్స్ ద్వయం సాకేత్-చిరాగ్ విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నం.2 జోడీ ఆరోన్, సో వూయ్‌పై 21-12, 21-19 తేడాతో నెగ్గారు. దీంతో కాంస్యం ఖరారు చేసుకున్నారు. మరోవైపు ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు నిరాశపరిచారు. ఇండోనేషియా ప్లేయర్ వర్ధనీ చేతిలో 21-14, 13-21, 21-16 పాయింట్ల తేడాతో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్-తనీశా జోడీ ఇంటి దారి పట్టింది.