News August 30, 2025
భీమవరం: డ్రగ్స్ నియంత్రణపై కలెక్టర్ సమీక్ష

మాదకద్రవ్యాల నియంత్రణపై భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం ఎన్‌కార్డ్ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గంజాయి సాగు, రవాణా, అమ్మకం, వినియోగం, పునరావాసం వంటి అంశాలపై చర్చించారు. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారికి చికిత్స అందించి, యువతలో అవగాహన కల్పించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News September 5, 2025
పాలకొల్లు: మహిళ కడుపులో భారీ గడ్డ

పోడూరులోని వద్దిపర్రుకు చెందిన కడియం సీతా మహాలక్ష్మి కడుపు నొప్పి, ఉబ్బరంతో గురువారం రాత్రి పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికివచ్చారు. వైద్యులు స్కాన్ చేసి కడుపులో గడ్డ ఉందని తెలిపారు. ఆమెకు ఆపరేషన్ చేసి విజయవంతంగా కణతిని బైటకు తీసి ఆమెను కాపాడారు. జనరల్, లాప్రోస్కోపిక్ సర్జన్ డా.లంకలపల్లి గోకుల్ కుమార్, డా. లక్ష్మి వైద్యులను అభినందించారు.
News September 4, 2025
వాహనాలను గూడ్స్ క్యారేజ్ గా మార్చుకోవాలి: కృష్ణారావు

మొబైల్ క్యాంటీన్‌గా రిజిస్టర్ అయిన వాహనాలను తక్షణమే గూడ్స్ క్యారేజ్‌గా మార్చుకోవాలని జిల్లా రవాణా అధికారి కృష్ణారావు గురువారం తెలిపారు. జిల్లాలో 334 మొబైల్ క్యాంటీన్ వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయని, వాటి యజమానులు సోమవారంలోగా తమ వాహన పత్రాలతో రవాణా శాఖ కార్యాలయాలను సంప్రదించాలన్నారు. మొబైల్ క్యాంటీన్ నుంచి గూడ్స్ క్యారేజ్‌గా మార్చుకోవాలని కోరారు.
News September 4, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేసీ

జిల్లాలో ఎరువుల కొరత లేదని, సొసైటీలో అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం వీరవాసరంలోని శ్రీనివాస ట్రేడర్స్, సాయి లక్ష్మి ఫెర్టిలైజర్స్, వ్యవసాయ సహకార సంఘం గోదాములను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా నిల్వలపై స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఎరువుల అమ్మకాలలో ప్రభుత్వ నియమాలను పాటించనిపై వారిపై చర్యలు తప్పవన్నారు.