News August 30, 2025

VZM: రైతుల్లో అవగాహన కలిగించాలి

image

విజయనగరం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచడానికి రైతులలో అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ అనుబంధ శాఖలతో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో 3 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేయాలని, తదుపరి గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Similar News

News August 30, 2025

పేకాట ఆడుతూ పట్టుబడ్డ మహిళలు

image

విజయనగరంలోని బాబామెట్ట‌లో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలపై కేసు నమోదు చేసినట్లు విజయనగరం టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. బాబా మెట్టలోని సప్తగిరి అపార్ట్మెంట్లో శుక్రవారం రాత్రి మహిళలు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. ఈ దాడిలో వారి నుంచి రూ.14,016, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

News August 29, 2025

VZM: 69 ఎకరాల్లో ఆక్వా సాగుకు అనుమతి

image

జిల్లాలో ప్రస్తుతం 200 ఎకరాల్లో ఆక్వా సాగు అవుతున్నదని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఆక్వాకల్చర్ సాగు జిల్లాలో విస్తృతం చేయు నిమిత్తం గజపతినగరం, బొండపల్లి మండలాల్లో సుమారు 69 ఎకరాలకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆక్వా సాగుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్‌లో జరిగింది. ఆక్వా సాగుకు అనువైన మండలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు.

News August 29, 2025

విజయనగరంలో పట్టాలు తప్పిన గూడ్స్

image

విజయనగరంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం రైల్యే స్టేషన్ సమీపంలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. గూడ్స్ రైలు టర్నింగ్ తిరుగుతుండగా అదుపు తప్పడంతో ఆఖరి రెండు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. గూడ్స్ కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపడుతున్నారు.