News August 30, 2025

ఈనెల 1న రూ.113.36 కోట్లు పెన్షన్ నగదు పంపిణీ: కలెక్టర్

image

సెప్టెంబరు నెలలో 2,61,221 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద రూ.113.36 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం ఏలూరులో అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. సెప్టెంబరు 1న ఉదయం 7 గంటలకు ఈ పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. 5,275 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

Similar News

News August 30, 2025

రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల స్థానమిదే..

image

దేశంలో 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే 1.72 లక్షల మంది మరణించగా, 4.62 లక్షల మంది గాయపడ్డారని కేంద్ర నివేదిక వెల్లడించింది. 2022తో పోలిస్తే ప్రమాదాలు 4.1%, మరణాలు 2.61% పెరిగాయని పేర్కొంది. రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాల్లో ఏపీ(8,276), TG(8,103) ఏడు, ఎనిమిది స్థానాల్లో, మరణాల్లో AP(3,806), తెలంగాణ(3,508) 8, 9 స్థానాల్లో ఉన్నాయి. మరణాల్లో అత్యధికం 35-45 ఏళ్ల వారే ఉన్నారని తెలిపింది.

News August 30, 2025

అన్నమయ్య కీర్తనలు ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఈవో

image

టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల పనితీరుపై ఈవో జె.శ్యామలరావు శుక్రవారం సమీక్ష చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో చర్చించారు. అన్నమయ్య కీర్తనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. దీనికోసం ఆడిషన్లు చేపట్టాలని సూచించారు. ఈనెల 31న హరికథ వైభవం కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

News August 30, 2025

ఈ ఏడాది చివర్లో నంది అవార్డులు: మంత్రి దుర్గేశ్

image

AP: తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో నంది అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. విశాఖలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. గిడుగు రామమూర్తి, గురజాడ, కందుకూరి కృషి ఫలితంగానే తెలుగు భాషకు మహోన్నత స్థానం లభించిందని చెప్పారు. ఈ క్రమంలో రామమూర్తి అవార్డు గ్రహీతలను సత్కరించి, అవార్డులు, నగదు అందజేశారు.