News August 30, 2025
సిద్దిపేట: శేరిపల్లి పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు

దౌల్తాబాద్ మండలం శేరిపల్లిలోని ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఎస్‌సీఈఆర్‌టీ ప్రచురించిన ‘ట్రైల్ బ్లేజర్స్’ అనే పుస్తకంలో ఈ పాఠశాల గురించి ఓ కథనం వచ్చింది. పాఠశాల టీచర్ బి.రవి రాసిన ‘పాఠశాల సమావేశాల్లో తల్లిదండ్రులను సులభంగా పాల్గొనేలా చేయొచ్చు’ అనే కథనానికి పేజీ నంబర్లు 277, 281లో చోటు దక్కింది. తల్లిదండ్రులు, టీచర్లు, దాతల సహకారంతోనే ఈ గుర్తింపు సాధ్యమైందని రవి తెలిపారు.
Similar News
News August 30, 2025
రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల స్థానమిదే..

దేశంలో 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే 1.72 లక్షల మంది మరణించగా, 4.62 లక్షల మంది గాయపడ్డారని కేంద్ర నివేదిక వెల్లడించింది. 2022తో పోలిస్తే ప్రమాదాలు 4.1%, మరణాలు 2.61% పెరిగాయని పేర్కొంది. రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాల్లో ఏపీ(8,276), TG(8,103) ఏడు, ఎనిమిది స్థానాల్లో, మరణాల్లో AP(3,806), తెలంగాణ(3,508) 8, 9 స్థానాల్లో ఉన్నాయి. మరణాల్లో అత్యధికం 35-45 ఏళ్ల వారే ఉన్నారని తెలిపింది.
News August 30, 2025
అన్నమయ్య కీర్తనలు ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఈవో

టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల పనితీరుపై ఈవో జె.శ్యామలరావు శుక్రవారం సమీక్ష చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో చర్చించారు. అన్నమయ్య కీర్తనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. దీనికోసం ఆడిషన్లు చేపట్టాలని సూచించారు. ఈనెల 31న హరికథ వైభవం కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
News August 30, 2025
ఈ ఏడాది చివర్లో నంది అవార్డులు: మంత్రి దుర్గేశ్

AP: తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో నంది అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. విశాఖలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. గిడుగు రామమూర్తి, గురజాడ, కందుకూరి కృషి ఫలితంగానే తెలుగు భాషకు మహోన్నత స్థానం లభించిందని చెప్పారు. ఈ క్రమంలో రామమూర్తి అవార్డు గ్రహీతలను సత్కరించి, అవార్డులు, నగదు అందజేశారు.