News August 30, 2025

ALLERT: భద్రాద్రి జిల్లాకు 5 రోజుల వర్ష సూచన

image

రానున్న 5 రోజులు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆగస్టు 30, సెప్టెంబర్ 1న భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 31న అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పారు. 5 రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు పంట పొలాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఎరువులు, పురుగుల మందులు పంటపొలాలపై చల్లకూడదని నోడల్ ఆఫీసర్ హరీష్ కుమార్ శర్మ తెలిపారు.

Similar News

News August 30, 2025

పెరుగుతున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

image

భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. నదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటడం, చేపల వేటకు వెళ్లడం వంటివి చేయవద్దని సూచించారు. రెండవ ప్రమాద హెచ్చరికకు ముందు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News August 30, 2025

రెండు ఉద్యోగాలు సాధించిన మాజీ ఆర్మీ ఉద్యోగి

image

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మసకవంకపల్లికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి చాగలేటి రమణ రెండు ఉద్యోగాలకు ఎంపికై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల పోలీస్ ఉద్యోగానికి ఎంపికై శిక్షణకు సిద్ధమవుతుండగానే, ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో ఉపాధ్యాయ కొలువు సాధించారు. ఈ విజయంపై కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.

News August 30, 2025

DSC 2025: ఒకే గ్రామంలో ఆరుగురికి ఉద్యోగాలు

image

నంద్యాల మండలంలోని చాపరేవుల గ్రామస్థులు డీఎస్సీ ఫలితాల్లో రాణించారు. ఈసారి గ్రామానికి చెందిన ఆరుగురు ఉపాధ్యాయ పోస్టులు సాధించారు. వారిలో మారెళ్ల రజిత, మోహన్ కుమార్, ఎర్రమల రంగన్న, మాతిరెడ్డి భారతి, అనూష పీఈటీలుగా, సురేఖ ఎస్జీటీగా ఎంపికయ్యారు. సురేఖ కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించగా, రజిత ఏపీ-తెలంగాణ రెండింటిలోనూ పీఈటీగా ఎంపికై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.