News August 30, 2025
ఆగస్టు 30: చరిత్రలో ఈ రోజు

1871: భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం
1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం
1936: సినీ నటి జమున జననం (ఫొటోలో)
1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం
1980: తెలుగు, హిందీ నటి రిచా పల్లాడ్ జననం
1994: సినీ హీరోయిన్ నందిత రాజ్ జననం
Similar News
News August 30, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

TG: భారీ వర్షాలు, వరదలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. పరిస్థితులు ఇంకా కుదుటపడకపోవడంతో ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ కూడా సెలవు ఉంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో ఇవాళ పరీక్షలు వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త తేదీలు వెల్లడిస్తామని JNTUH ప్రకటనలో తెలిపింది.
News August 30, 2025
పండగ పవన్ కళ్యాణ్‌దేనా..!

ఈసారి దసరాకు ‘OG’(SEP 25) మినహా పెద్ద చిత్రాల సందడి కనిపించట్లేదు. మొన్నటి వరకు బరిలో ఉందనుకున్న ‘అఖండ-2’ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పవన్ సినిమాకు ప్లస్‌గా మారింది. మూవీకి బజ్ ఉండటం, ఆ సమయంలో ఇతర భారీ చిత్రాలు రిలీజ్‌కు లేకపోవడంతో హిట్ టాక్ పడితే బొమ్మ బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమైతే ఈసారి పండగ పవన్ కళ్యాణ్‌దేనని ఫ్యాన్స్ అంటున్నారు.
News August 30, 2025
రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా: తుమ్మల

TG: ఇవాళో, రేపో రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్రానికి అదనపు కేటాయింపులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30వేల టన్నుల యూరియా ఉందని, రోజుకు సగటున 9-11 వేల టన్నుల అమ్మకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అదనంగా 2.38 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు.