News August 30, 2025
KMR: జిల్లాలో రూ.130.37 కోట్ల వరద నష్టం అంచనా

ఇటీవల కామారెడ్డి జిల్లాలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనా నివేదిక శుక్రవారం విడుదలైంది. జిల్లా యంత్రాంగం సేకరించిన సమాచారం ప్రకారం, మొత్తం నష్టం రూ.130.37 కోట్లుగా అంచనా వేయబడింది. దీనిలో తక్షణ మరమ్మతులకు రూ.22.47 కోట్లు అవసరమని పేర్కొంది. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాత నష్టం అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News August 30, 2025
పరిటాల రవి.. ఈ విషయం తెలుసా?

పరిటాల రవీంద్ర అందరికీ సుపరిచితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. 1958 ఆగస్టు 30న జన్మించిన ఆయన 1993 జూన్ 7న టీడీపీలో చేరారు. అప్పటి నుంచి సీమ రాజకీయాలు ఇంకో మలుపు తిరిగాయి. ఆ సమయంలో అరెస్టయిన ఆయన జైలు నుంచే నామినేషన్ దాఖలు వేశారు. అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
★ నేడు పరిటాల రవి జయంతి
News August 30, 2025
వినాయక నిమజ్జనంలో అపశృతి

సి.బెళగల్‌లో వినాయక నిమజ్జనం వేళ విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. దాసరి వీధిలో వినాయకుడిని ట్రాక్టరులో నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో క్రిష్ణదొడ్డి రోడ్డులోని చెరువు కట్టపై విద్యుత్ వైర్లు తగలడంతో ట్రాక్టరులో ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో చంద్ర (19) ఆస్వస్థతకు గురికాగా కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందాడని తండ్రి రుద్రయ్య తెలిపారు.
News August 30, 2025
అల్లు అర్జున్ ఇంట్లో విషాదం

అల్లు అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం(94) ఇవాళ అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలియడంతో బన్నీ ముంబై నుంచి HYDకు బయల్దేరారు. ఆమె చిరంజీవికి అత్త కాగా రామ్‌చరణ్‌కు అమ్మమ్మ. దీంతో మైసూరులో ఉన్న చెర్రీ HYDకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి.