News August 30, 2025
31 లోపు అభ్యంతరాల స్వీకరణ: ములుగు కలెక్టర్

ములుగు కలెక్టరేట్‌లో ఓటర్ ముసాయిదా జాబితాపై జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. గురువారం విడుదల చేసిన వార్డు, గ్రామ పంచాయతీ ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 31వ తేదీలోగా అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News August 30, 2025
NLG: మామ హత్య.. కోడలు, ప్రియుడికి జీవిత ఖైదు

మామను హత్య చేసిన కేసులో కోడలు పద్మ, ఆమె ప్రియుడు వేణుకు జీవిత ఖైదు పడినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. 2017 ఆగస్టు 3న నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన పద్మ, ఆమె ప్రియుడుతో ఇంట్లో ఉన్నప్పుడు మామ భిక్షమయ్య చూశాడు. ఈ విషయాన్ని తన కుమారుడికి చెబుతానన్నాడు. దీంతో ఆగ్రహించిన ఇద్దరూ భిక్షమయ్యను హత్య చేశారు. ఈ కేసులో విచారణ అనంతరం కోర్టు వారికి శిక్ష విధించిందని ఎస్పీ వెల్లడించారు.
News August 30, 2025
పరిటాల రవి.. ఈ విషయం తెలుసా?

పరిటాల రవీంద్ర అందరికీ సుపరిచితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. 1958 ఆగస్టు 30న జన్మించిన ఆయన 1993 జూన్ 7న టీడీపీలో చేరారు. అప్పటి నుంచి సీమ రాజకీయాలు ఇంకో మలుపు తిరిగాయి. ఆ సమయంలో అరెస్టయిన ఆయన జైలు నుంచే నామినేషన్ దాఖలు వేశారు. అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
★ నేడు పరిటాల రవి జయంతి
News August 30, 2025
వినాయక నిమజ్జనంలో అపశృతి

సి.బెళగల్‌లో వినాయక నిమజ్జనం వేళ విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. దాసరి వీధిలో వినాయకుడిని ట్రాక్టరులో నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో క్రిష్ణదొడ్డి రోడ్డులోని చెరువు కట్టపై విద్యుత్ వైర్లు తగలడంతో ట్రాక్టరులో ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో చంద్ర (19) ఆస్వస్థతకు గురికాగా కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందాడని తండ్రి రుద్రయ్య తెలిపారు.