News August 30, 2025

మరోసారి తల్లి కాబోతున్న నటి

image

సినీ నటి పూర్ణ మరోసారి తల్లి కానున్నారు. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన పూర్ణ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2023లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 2026లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పూర్ణ తెలిపారు. అఖండ, దసరా, సుందరి, సీమ టపాకాయ్, అవును తదితర చిత్రాల్లో ఆమె నటించారు.

Similar News

News August 30, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,640 పెరిగి రూ.1,04,950కు చేరింది. కాగా 5 రోజుల్లో రూ.3,440 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,500 ఎగబాకి రూ.96,200 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,100 పెరిగి రూ.1,31,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 30, 2025

C ఫర్ కాంగ్రెస్/చీటింగ్/చోరీ: కేటీఆర్

image

TG: సీ ఫర్ కాంగ్రెస్, చీటింగ్, చోరీ అంటూ BRS నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. వాళ్లకు తెలిసిన నంబర్ ‘420’ అని సెటైర్లు వేశారు. ‘మహిళలకు రూ.2,500 ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. రూ.500కే గ్యాస్ సిలిండర్, తులం బంగారం, టూ వీలర్స్, కోటీశ్వరులను చేస్తామని హామీలు ఇచ్చారు. మహిళల జీవనోపాధిని లాక్కుంటున్నారు. ఇళ్లను నేలకూలుస్తున్నారు. ఇది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్. ఒక్క ఓటు మూల్యం ఐదేళ్లు’ అని Xలో రాసుకొచ్చారు.

News August 30, 2025

కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

image

జమ్మూకశ్మీర్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా రియాసీ జిల్లాలోని మహోరే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో ఏడుగురు మరణించారు. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అంతకుముందు రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌తో <<17559722>>ముగ్గురు<<>> మరణించారు.