News August 30, 2025
సింధు ఓటమి.. సాత్విక్ జోడీపైనే ఆశలు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మెన్స్ డబుల్స్ ద్వయం సాకేత్-చిరాగ్ విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నం.2 జోడీ ఆరోన్, సో వూయ్‌పై 21-12, 21-19 తేడాతో నెగ్గారు. దీంతో కాంస్యం ఖరారు చేసుకున్నారు. మరోవైపు ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు నిరాశపరిచారు. ఇండోనేషియా ప్లేయర్ వర్ధనీ చేతిలో 21-14, 13-21, 21-16 పాయింట్ల తేడాతో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్-తనీశా జోడీ ఇంటి దారి పట్టింది.
Similar News
News August 30, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,640 పెరిగి రూ.1,04,950కు చేరింది. కాగా 5 రోజుల్లో రూ.3,440 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,500 ఎగబాకి రూ.96,200 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,100 పెరిగి రూ.1,31,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 30, 2025
C ఫర్ కాంగ్రెస్/చీటింగ్/చోరీ: కేటీఆర్

TG: సీ ఫర్ కాంగ్రెస్, చీటింగ్, చోరీ అంటూ BRS నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. వాళ్లకు తెలిసిన నంబర్ ‘420’ అని సెటైర్లు వేశారు. ‘మహిళలకు రూ.2,500 ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. రూ.500కే గ్యాస్ సిలిండర్, తులం బంగారం, టూ వీలర్స్, కోటీశ్వరులను చేస్తామని హామీలు ఇచ్చారు. మహిళల జీవనోపాధిని లాక్కుంటున్నారు. ఇళ్లను నేలకూలుస్తున్నారు. ఇది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్. ఒక్క ఓటు మూల్యం ఐదేళ్లు’ అని Xలో రాసుకొచ్చారు.
News August 30, 2025
కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

జమ్మూకశ్మీర్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా రియాసీ జిల్లాలోని మహోరే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో ఏడుగురు మరణించారు. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అంతకుముందు రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌తో <<17559722>>ముగ్గురు<<>> మరణించారు.