News August 30, 2025
అన్నమయ్య కీర్తనలు ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఈవో

టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల పనితీరుపై ఈవో జె.శ్యామలరావు శుక్రవారం సమీక్ష చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో చర్చించారు. అన్నమయ్య కీర్తనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. దీనికోసం ఆడిషన్లు చేపట్టాలని సూచించారు. ఈనెల 31న హరికథ వైభవం కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
Similar News
News August 30, 2025
తుర్కపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన పర్వతం రాజు(20) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతం వాసుదేవ్ కుమారుడు రాజు కోల్తూరులో ఓ ఫార్మ కంపెనీలో పని చేస్తున్నాడు. విధులకు వెళుతుండగా వెనుకనుంచి కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. రాజు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News August 30, 2025
ఇలాంటి వాట్సాప్ గ్రూపులు అన్ని ఊర్లలో ఉంటే..!

ఎమర్జెన్సీలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని సంగారెడ్డిలో ‘నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్’ పేరిట 8 ఏళ్లుగా వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ, ఎవరికి రక్తం అవసరమైనా దాంట్లో మెసేజ్ చేస్తే చాలు దగ్గరున్నవాళ్లు అక్కడికి వస్తారు. ఇలాంటి వాట్సాప్ గ్రూప్స్ ప్రతి గ్రామానికీ ఉంటే ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడటమే కాకుండా ఊరి ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయి.
News August 30, 2025
మదనపల్లె మార్కెట్లో పడిపోయిన టమాటా ధర

మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరలు కిలో రూ.25కు పడిపోయాయి. శనివారం మార్కెట్‌కు 113 మెట్రిక్ టన్నుల టమాటాలు రాగా మొదటి రకం10 కిలోల టమాటా బాక్స్ రూ.250కు అమ్ముడుపోయింది. రెండో రకం రూ.230, మూడో రకం రూ.200 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారని మదనపల్లె టమోటా మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. అయితే వ్యాపారులు సిండికేటుగా మారి రైతుల్ని మోసాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.