News August 30, 2025

నేడు విశాఖలో జనసేన బహిరంగ సభ

image

AP: విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇవాళ జనసేన బహిరంగ సభ(సేనతో సేనాని) నిర్వహించనుంది. రెండు రోజులుగా పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించిన పార్టీ చీఫ్ పవన్ భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీకి జన సైనికులు, వీర మహిళలే బలమని నొక్కి చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ సభలో పవన్ ఏం మాట్లాడుతారోననే ఆసక్తి నెలకొంది.

Similar News

News August 30, 2025

బాబు కడితే ఇల్లా.. జగన్ కడితే ప్యాలెసా?: గుడివాడ

image

AP: <<17552693>>రుషికొండ<<>>లో Dy.CM పవన్ కళ్యాణ్ డ్రామాలాడారని YCP నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సీలింగ్ కట్ చేసి, అక్కడ ఫొటోలు దిగారని ఆయన ఆరోపించారు. ‘రుషికొండ భవనాలను వాడుకునేందుకు చంద్రబాబు, పవన్, లోకేశ్ పోటీపడుతున్నారు. చంద్రబాబు రూ.200 కోట్లతో హైదరాబాద్‌లో ఇల్లు కడితే అది పూరి గుడిసె. కానీ జగన్ ఇల్లు కట్టుకుంటే మాత్రం అది ప్యాలెసా’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News August 30, 2025

ధోనీకి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన BCCI?

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు క్రిక్ బ్లాగర్ పేర్కొంది. 2021 టీ20 వరల్డ్ కప్‌కు ధోనీ టీమ్ ఇండియా మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈసారి అలా పార్ట్ టైమ్ కాకుండా ఫుల్ టైమ్ మెంటర్‌గా ఉండాలని ధోనీని కోరినట్లు బీసీసీఐ ప్రతినిధి తెలిపారని వివరించింది. సీనియర్, జూనియర్ జట్లు సహా మహిళల టీమ్స్‌కూ MSDని మెంటర్‌గా వ్యవహరించాలని కోరినట్లు తెలిపింది.

News August 30, 2025

ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అజహరుద్దీన్‌

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అజహరుద్దీన్‌ క్యాబినెట్ ఖరారు చేసింది. ఇవాళ జరిగిన భేటీలో వీరిద్దరి పేర్లకు ఆమోదం తెలిపింది. గతంలో ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా, ఇటీవల వారిద్దరి నియామకాన్ని<<17393463>> సుప్రీంకోర్టు<<>> రద్దు చేసిన సంగతి తెలిసిందే. అమీర్ అలీఖాన్‌ స్థానంలో అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించారు.