News August 30, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

TG: భారీ వర్షాలు, వరదలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. పరిస్థితులు ఇంకా కుదుటపడకపోవడంతో ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ కూడా సెలవు ఉంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో ఇవాళ పరీక్షలు వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త తేదీలు వెల్లడిస్తామని JNTUH ప్రకటనలో తెలిపింది.
Similar News
News August 30, 2025
రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2,865 అప్రంటీస్ పోస్టులు

వెస్ట్ సెంట్రల్ రైల్వే 2,865 అప్రంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు టెన్త్, ITI పూర్తి చేసుండాలి. వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. SC, ST అభ్యర్థులకు రూ.41, మిగతావారికి రూ.141 ఫీజు ఉంటుంది. మెరిట్ ఆధారంగా రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వచ్చే నెల 29లోగా <
News August 30, 2025
గుండెపోటుతో కార్డియాలజిస్ట్ మృతి.. ఒత్తిడి వల్లేనా?

చెన్నైకి చెందిన 39 ఏళ్ల గుండె వైద్యుడు డా.గ్రాడ్లిన్ రాయ్ ఆస్పత్రిలోనే గుండెపోటుతో చనిపోయారు. ఎక్కువ పనిగంటలు, నిద్రలేమి, అధిక ఒత్తిడి, జీవనశైలి వల్ల ఏటా ఇండియాలో చాలామంది వైద్యులు చనిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇతరులతో పాటు వైద్యులు కూడా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. యోగా చేయడం, ధూమపానం & మద్యపానానికి దూరంగా ఉండాలంటున్నారు.
News August 30, 2025
అందుకే ముగ్గురు పిల్లలను కనాలనుకుంటున్నా: జాన్వీ కపూర్

తాను ముగ్గురు పిల్లలను కనాలనుకుంటున్నట్లు హీరోయిన్ జాన్వీ కపూర్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ‘పరమ్ సుందరి’ ప్రమోషన్లలో ఆమె స్పందించారు. ‘నా లక్కీ నంబర్ 3. పెళ్లి తర్వాత ముగ్గురికి జన్మనిస్తా. వారిలో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మూడో బిడ్డ ఎవరికి సపోర్ట్ చేస్తారో నేను చూడాలి. సందర్భాన్ని బట్టి వాళ్ల మద్దతు మారుతూ ఉంటుంది. ఇలా నా బిడ్డలందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు’ అంటూ చెప్పారు.