News August 30, 2025

పెరుగుతున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

image

భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. నదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటడం, చేపల వేటకు వెళ్లడం వంటివి చేయవద్దని సూచించారు. రెండవ ప్రమాద హెచ్చరికకు ముందు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Similar News

News August 30, 2025

శోభాయాత్రలు శాంతియుతంగా నిర్వహించాలి: SP

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రలు శాంతియుతంగా, సురక్షితంగా జరగాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. శోభాయాత్రల మార్గాల్లో ముందుగానే తనిఖీలు చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రధాన రహదారులు,కూడళ్లు,నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

News August 30, 2025

అసెంబ్లీలో PPT సంప్రదాయం లేదు: Dy.CM భట్టి

image

ఖమ్మం: అసెంబ్లీలో ప్రతిపక్షాలకు పవర్ పాయింట్‌ ప్రెజెంటేషన్‌(పీపీటీ) చేసే సంప్రదాయం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. BRS హయాంలో తమ పీపీటీకి అవకాశం కల్పించాలని లేఖ ఇచ్చినప్పటికీ, అప్పుడు అవకాశం ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వం రూ.6,500 కోట్ల వడ్డీ కట్టలేదనే బీఆర్ఎకస్ వాదన సరైనది కాదని పేర్కొన్నారు.

News August 30, 2025

గుండెపోటుతో కార్డియాలజిస్ట్ మృతి.. ఒత్తిడి వల్లేనా?

image

చెన్నైకి చెందిన 39 ఏళ్ల గుండె వైద్యుడు డా.గ్రాడ్లిన్ రాయ్ ఆస్పత్రిలోనే గుండెపోటుతో చనిపోయారు. ఎక్కువ పనిగంటలు, నిద్రలేమి, అధిక ఒత్తిడి, జీవనశైలి వల్ల ఏటా ఇండియాలో చాలామంది వైద్యులు చనిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇతరులతో పాటు వైద్యులు కూడా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. యోగా చేయడం, ధూమపానం & మద్యపానానికి దూరంగా ఉండాలంటున్నారు.