News August 30, 2025
కుప్పంలో సీఎం.. నేటి షెడ్యూల్ ఇలా!

సీఎం చంద్రబాబు కుప్పంలో నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు శాంతిపురం(M) శివపురంలోని తన ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో పరమసముద్రంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుంటారు. బస్సులోనే మహిళలతో మాట్లాడుతారు. 11:30 గంటలకు జలహారతి ఇస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులతో ఎంవోయూలు చేసుకుంటారు.
Similar News
News September 1, 2025
రేపటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరిక్షలు: ఎస్పీ

చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 2 నుంచి 7 వరకు వైద్య పరిక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ ఆదివారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 6 గంటలకు చిత్తూరు పాత జిల్లా పోలీసు కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు 2, 3న, పురుష అభ్యర్థులకు 4 నుంచి 7 వరకు పరిక్షలు నిర్వహిస్తారన్నారు.
News August 31, 2025
రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా వేదిక: కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్‌లో ఆదివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ప్రజా వేదికను వినియోగించుకోవాలని సూచించారు.
News August 31, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.122, మాంసం రూ.177 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.201 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.