News August 30, 2025
చీమకుర్తిలోని క్వారీలో ప్రమాదం

చీమకుర్తిలోని మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి క్వారీలోని ఓ అంచు విరిగి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే రాళ్లు విరిగిపడిన సమయంలో 50 మంది కూలీలు భోజనానికి వెళ్లినట్లు తెలిసింది. దీనితో పెను ప్రమాదం తప్పింది. కాగా క్వారీలో ఉన్న మెషిన్ పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తుంది.
Similar News
News August 31, 2025
మార్కాపురం మీదుగా తిరుపతికి స్పెషల్ ట్రైన్!

జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి నవంబర్ 25 వరకు ఈ రైలు జిల్లా గుండా తిరుపతికి చేరుకోనుంది. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి రాత్రి 9.10 గంటలకు బయలుదేరి జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు స్టేషన్ల మీదుగా నంద్యాలకు చేరుతుంది. అక్కడి నుంచి తిరుపతికి వెళుతుందని అధికారులు తెలిపారు.
News August 31, 2025
ప్రకాశం జిల్లాలో 5 బార్లకు రీ- నోటిఫికేషన్

ప్రకాశం జిల్లాలో 5 ఓపెన్ కేటగిరి బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 బార్లు, మార్కాపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2 బార్లకు రీ- నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ బార్లకై వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం 6లోగా ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తామని, 2న లాటరీ తీస్తామన్నారు.
News August 31, 2025
గిద్దలూరు: జడ్జికి అసభ్య పదజాలంతో లెటర్

జడ్జిలను దూషించిన ఓ వ్యక్తికి రిమాండ్ పడింది. గిద్దలూరు జడ్జికి ఆగస్ట్ 28వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ రిజిస్ట్రర్ పోస్ట్ వచ్చింది. అది తెరిచి చూడగా అసభ్యపదజాలంతో మేటర్ ఉంది. జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు కోర్టులోనే అటెండర్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఈ లెటర్ రాసినట్లు గుర్తించారు. అతడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ ఉత్తర్వులు ఇచ్చారు.