News April 2, 2024
HYD: ‘సిబ్బంది సగం.. తనిఖీలు తూచ్’

HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో తూనీక కొలతల శాఖలో లైసెన్స్ హోల్డర్ల నియామకం అంతంత మాత్రంగానే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 30 మందికి పైగా సిబ్బంది లేకపోవడం గమనార్హం. దీంతో తూనికలపై నగరంలోని అనేక చోట్ల తనిఖీలు కరవయ్యాయి. లైసెన్స్ లేకుండానే అనేక దుకాణాల్లో విచ్చలవిడిగా బరువు కొలిచే యంత్రాలను ఉపయోగిస్తున్నారని, వాటికి గ్యారంటీ ఏంటని వినియోగదారులు వాపోతున్నారు.
Similar News
News September 10, 2025
లివర్ బాధితులకు నిమ్స్ భరోసా.. త్వరలో అత్యాధునిక చికిత్స

కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారికి నిమ్స్ ఆస్పత్రి భరోసా ఇస్తోంది. త్వరలో అత్యాధునిక ఇంజెక్షన్‌ను అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 2 నుంచి ఇది పేషెంట్లకు అందుబాటులో ఉంటుందని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా కేవలం రీజనరేటివ్ మెడిసిన్‌తో లివర్ పనితీరును మెరుగుపరచవచ్చని డైరెక్టర్ తెలిపారు.
News September 10, 2025
ఇకపై ఓయూ విద్యార్థులకు ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలు

ఓయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు AI, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇరువర్గాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. JNTUHలో ఇప్పటికే ఈ పద్ధతిలో బోధిస్తున్నారు.
News September 10, 2025
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో క్యాన్సర్ కేర్ సెంటర్

మంత్రి దామోదర్ రాజనర్సింహ వర్చువల్‌గా 33 జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో పాలియేటివ్ కేర్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమం వర్చువల్‌గా జరిగింది. సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ప్రిన్సిపల్ డా.ఇందిర, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సునీల్, RMO డా.శేషాద్రి, వైస్ ప్రిన్సిపల్ డా.రవిశేఖర్ రావు పాల్గొన్నారు.