News August 30, 2025

ప్రకాశం: బార్ల లైసెన్స్ కోసం 78 దరఖాస్తులు.. కాసేపట్లో లాటరీ..!

image

ఓపెన్ కేటగిరీకి సంబంధించి 26 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, 78 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని కార్యాలయంలో మాట్లాడారు. 26 బార్లకు గాను 17 బార్లకు దరఖాస్తులు అందాయన్నారు. గీత కులాలకు కేటాయించిన 3 బార్లకు 14 వచ్చాయని తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ వద్ద కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందన్నారు.

Similar News

News August 31, 2025

మార్కాపురం మీదుగా తిరుపతికి స్పెషల్ ట్రైన్!

image

జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి నవంబర్ 25 వరకు ఈ రైలు జిల్లా గుండా తిరుపతికి చేరుకోనుంది. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి రాత్రి 9.10 గంటలకు బయలుదేరి జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు స్టేషన్ల మీదుగా నంద్యాలకు చేరుతుంది. అక్కడి నుంచి తిరుపతికి వెళుతుందని అధికారులు తెలిపారు.

News August 31, 2025

ప్రకాశం జిల్లాలో 5 బార్లకు రీ- నోటిఫికేషన్

image

ప్రకాశం జిల్లాలో 5 ఓపెన్ కేటగిరి బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 బార్లు, మార్కాపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2 బార్లకు రీ- నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ బార్లకై వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం 6లోగా ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తామని, 2న లాటరీ తీస్తామన్నారు.

News August 31, 2025

గిద్దలూరు: జడ్జికి అసభ్య పదజాలంతో లెటర్

image

జడ్జిలను దూషించిన ఓ వ్యక్తికి రిమాండ్ పడింది. గిద్దలూరు జడ్జికి ఆగస్ట్ 28వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ రిజిస్ట్రర్ పోస్ట్ వచ్చింది. అది తెరిచి చూడగా అసభ్యపదజాలంతో మేటర్ ఉంది. జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు కోర్టులోనే అటెండర్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఈ లెటర్ రాసినట్లు గుర్తించారు. అతడికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ ఉత్తర్వులు ఇచ్చారు.