News August 30, 2025

పెన్షన్ రావాలంటే సాయంత్రంలోగా అప్పీల్ చేసుకోండి!

image

AP: దివ్యాంగులు, ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి పునర్‌పరిశీలనకు అప్పీల్ చేసుకున్న వారికి SEP 1న ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అనర్హుల తొలగింపే లక్ష్యంగా 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. వీరిలో అర్హులు ఉంటే అప్పీల్ చేసుకోవాలని చెప్పారు. ఇందుకు ఇవాళ సాయంత్రంలోపు అవకాశం ఇచ్చారు. వారితో అప్పీల్ చేయించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లు, MPDOలు, మున్సిపల్ కమిషన్లకు అప్పగించింది.

Similar News

News August 30, 2025

గ్రౌండ్‌లో వర్షం.. పిచ్ ఆరేందుకు మంట

image

కెనడాలో తడిసిన మైదానాన్ని ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది పిచ్‌పై నిప్పంటించడం చర్చనీయాంశంగా మారింది. కెనడాలోని టొరంటోలో ఉన్న నార్త్-వెస్ట్ గ్రౌండ్‌లో స్కాట్లాండ్, నమీబియా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వాన అంతరాయం కలిగించింది. గ్రౌండ్ ఎంతకూ ఆరకపోవడంతో సిబ్బంది భిన్నంగా ఆలోచించి మంట పెట్టారు. చివరకు కట్ ఆఫ్ సమయానికి కూడా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

News August 30, 2025

హిందూ ధర్మంలో సంస్కారాలు ఏవి..?

image

సమాజ హితం, మానవ వికాసం కోసం రుషులు హిందూ ధర్మంలో 16 సంప్రదాయాలను సంస్కారాలుగా గుర్తించారు. అవి.. 1. పెళ్లి, 2. గర్భాధారణ, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశన, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణ, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం, 13. కర్ణభేదం, 14. విద్యారంభం, 15. వేదారంభం, 16. అంత్యేష్టి.
ఈ షోడశ సంస్కారాల విశిష్టతను ఒక్కో రోజు ఒక్కోటిగా తెలుసుకుందాం.

News August 30, 2025

PHOTO OF THE DAY

image

ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పే భేటీకి రంగం సిద్ధమైంది. చైనాలో రేపు, ఎల్లుండి జరిగే SCO సమ్మిట్ కోసం PM <<17563955>>మోదీ డ్రాగన్<<>> గడ్డపై అడుగుపెట్టారు. చైనా, రష్యా అధ్యక్షులు జిన్‌పింగ్, పుతిన్‌తో భేటీ కానున్నారు. టారిఫ్స్‌తో ఇబ్బంది పెడుతున్న అమెరికాకు ఈ సమావేశంతో చెమటలు పట్టడం ఖాయమని జియో పాలిటిక్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. భారత్, రష్యా, చైనా కలిస్తే ప్రపంచ ముఖచిత్రం మారిపోతుందని అభిప్రాయపడుతున్నారు.