News August 30, 2025
వరంగల్: భద్రకాళి అమ్మవారి దర్శనం

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు శనివారం ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.
Similar News
News August 30, 2025
గ్రౌండ్‌లో వర్షం.. పిచ్ ఆరేందుకు మంట

కెనడాలో తడిసిన మైదానాన్ని ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది పిచ్‌పై నిప్పంటించడం చర్చనీయాంశంగా మారింది. కెనడాలోని టొరంటోలో ఉన్న నార్త్-వెస్ట్ గ్రౌండ్‌లో స్కాట్లాండ్, నమీబియా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వాన అంతరాయం కలిగించింది. గ్రౌండ్ ఎంతకూ ఆరకపోవడంతో సిబ్బంది భిన్నంగా ఆలోచించి మంట పెట్టారు. చివరకు కట్ ఆఫ్ సమయానికి కూడా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
News August 30, 2025
మెదక్: రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ మీటింగ్

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వత తేదీ వరకు స్వీకరిస్తామన్నారు.
News August 30, 2025
హిందూ ధర్మంలో సంస్కారాలు ఏవి..?

సమాజ హితం, మానవ వికాసం కోసం రుషులు హిందూ ధర్మంలో 16 సంప్రదాయాలను సంస్కారాలుగా గుర్తించారు. అవి.. 1. పెళ్లి, 2. గర్భాధారణ, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశన, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణ, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం, 13. కర్ణభేదం, 14. విద్యారంభం, 15. వేదారంభం, 16. అంత్యేష్టి.
ఈ షోడశ సంస్కారాల విశిష్టతను ఒక్కో రోజు ఒక్కోటిగా తెలుసుకుందాం.