News August 30, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ ఆదిలాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని పేర్కొంది.

Similar News

News August 30, 2025

Fortune పవర్‌ఫుల్ ఉమన్ – 2025 వీళ్లే

image

ప్రముఖ మ్యాగజైన్ ఫార్చున్ భారత వ్యాపార రంగంలో పవర్‌ఫుల్ ఉమన్ 2025 లిస్ట్ విడుదల చేసింది. ఇందులో FM నిర్మలా సీతారామన్, ముకేశ్ అంబానీ భార్య నీతా టాప్2లో ఉన్నారు. ఇక అపోలో ఫౌండర్ డా. ప్రతాప్ రెడ్డి కూతుళ్లు శోభన, సంగీత, ప్రీతా, సునీత (బిజినెస్ సర్కిల్‌లో రెడ్డి సిస్టర్స్ అంటారు) 3, HCL ఫౌండర్ శివ నాడార్ కూతురు రోష్ని నాడార్ 4, నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బేలా బజారియా 5వ స్థానాల్లో నిలిచారు.

News August 30, 2025

రేపు అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్.. MLAలతో ఉత్తమ్ సమావేశం

image

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ HYD జలసౌధలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదిక వివరాలను వారికి వివరించారు. అసెంబ్లీలో BRSను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఉత్తమ్ సూచనతో ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గన్‌మెన్, వ్యక్తిగత సిబ్బంది, ఫోన్లు లేకుండా వెళ్లినట్లు తెలుస్తోంది.

News August 30, 2025

డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన రద్దు?

image

మోదీ చైనాలో పర్యటిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారత్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌కు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దీనిపై ఇంకా ఇరు దేశాలు స్పందించలేదని పేర్కొంది. కాగా వచ్చే నవంబర్‌లో ఢిల్లీలో క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నేతలు హాజరు కావాల్సి ఉంది.