News August 30, 2025

NLG: అసెంబ్లీలో జిల్లా సమస్యలపై గళం

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభవుతున్న నేపథ్యంలో జిల్లా సమస్యలపై అధికార, ప్రతిపక్ష MLAలు తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఏ వర్గానికి న్యాయం చేయలేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాల క్యాలెండర్, రైతుల రుణమాఫీ, యూరియా కొరత వంటి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 5, 2025

NLG: 4400 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

image

నల్గొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల పరిధిలో L-1 కింద ఉన్న 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తెలిపారు. ఇప్పటివరకు 4400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% తేమ ఉండడంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావాలని సూచించారు.

News November 5, 2025

NLG: కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం ఘటనలు

image

జిల్లాలో మహిళల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతుంది. తిప్పర్తి పీఎస్ పరిధిలో కాజీరామారం గ్రామానికి చెందిన కందుకూరి సౌజన్య(24), చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన వివాహిత మంకాల రేణుక(35)లు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కూడా వివాహితులే కావడం విశేషం.

News November 5, 2025

NLG: రేపటి నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

image

మహాత్మాజ్యోతిబా ఫులే గురుకుల సొసైటీ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకులంలో ఈనెల 6వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 14 ఏళ్ల నుంచి 19 ఏళ్ల బాలురకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, తదితర అన్ని రకాల ఆటలు ఉంటాయి. గేమ్స్‌కు సంబంధించి స్పోర్ట్స్ మీట్, సెలక్షన్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ తెలిపారు.