News April 2, 2024
వెంకటగిరి: పింఛన్ కోసం వచ్చి వృద్ధుడు మృతి

తనకు రావాల్సిన పింఛను కోసం తిరుపతి నుంచి వెంకటగిరిలోని బంగారు పేటకు 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య వచ్చాడు. పింఛన్ విషయం కనుక్కునేందుకు ఎండలో సచివాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News April 21, 2025
నెల్లూరు కలెక్టరేట్‌లో ఉచిత భోజనం

నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వీరికి కలెక్టర్ ఓ.ఆనంద్ ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
News April 21, 2025
NLR: వాగులో మహిళ మృతదేహం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సోమవారం మహిళ మృతదేహం కలకలం రేపింది. అనికేపల్లి సమీపంలోని కర్రోడ వాగులో మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామస్థులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. వెంకటాచలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News April 21, 2025
నెల్లూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 668 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-264 ➤ BC-A:50 ➤ BC-B:61
➤ BC-C:8 ➤ BC-D:46 ➤ BC-E:26
➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:40
➤ SC-గ్రేడ్3:51 ➤ ST:43 ➤ EWS:65
➤ PH-విజువల్:2 ➤ PH- హియర్:2
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16155982>>ఇక్కడ <<>>క్లిక్ చేయండి.