News August 30, 2025

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేనా?

image

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనకు అవకాశం కల్పించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కావాలని కోరారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరి మిథున్ రెడ్డి బెయిల్ వస్తుందో? లేదో? చూడాలి మరి.

Similar News

News September 1, 2025

రేపటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరిక్షలు: ఎస్పీ

image

చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 2 నుంచి 7 వరకు వైద్య పరిక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ ఆదివారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 6 గంటలకు చిత్తూరు పాత జిల్లా పోలీసు కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు 2, 3న, పురుష అభ్యర్థులకు 4 నుంచి 7 వరకు పరిక్షలు నిర్వహిస్తారన్నారు.

News August 31, 2025

రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా వేదిక: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ఆదివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ప్రజా వేదికను వినియోగించుకోవాలని సూచించారు.

News August 31, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.122, మాంసం రూ.177 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.201 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.