News August 30, 2025

Mood of the Nation: మూడో స్థానంలో CBN

image

ఇండియా టుడే- సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యంత ఆదరణ పొందిన సీఎంగా UP CM ఆదిత్యనాథ్(36%) తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో బెంగాల్ సీఎం మమత(13%), AP సీఎం చంద్రబాబు(7%) ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్(2.1%) ఏడో స్థానంలో ఉన్నారు. బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం(హోమ్ స్టేట్)ల జాబితాలో టాప్-3లో అస్సాం CM హిమంత బిశ్వశర్మ, ఛత్తీస్‌గఢ్ CM విష్ణుదేవ్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఉన్నారు.

Similar News

News August 31, 2025

మోదీ-ట్రంప్ మధ్య విభేదాలకు కారణం ఇదేనా?

image

మోదీకి జూన్ 17న కాల్ చేసిన ట్రంప్.. భారత్-పాక్ సీజ్‌ఫైర్ గురించి ప్రస్తావించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తాను యుద్ధాన్ని ముగించానని, పాక్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబోతుందని చెప్పినట్లు రాసుకొచ్చింది. దాన్ని మోదీ తిరస్కరించారని, సీజ్‌ఫైర్‌లో మూడో దేశం ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారని తెలిపింది. నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ చేసేందుకు ఇష్టపడకపోవడంతో ట్రంప్ అలిగినట్లు వివరించింది.

News August 30, 2025

ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు: CM

image

AP: కుప్పానికి కృష్ణమ్మను తీసుకొచ్చేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడ్డానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో ఈ ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పారు. 738 కి.మీ. దూరం నుంచి కృష్ణమ్మ కుప్పానికి రావడంతో ప్రజల్లో ఆనందం చూసి ఎంతో సంతోషం కలిగిందన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇదో మరిచిపోలేని రోజని తెలిపారు.

News August 30, 2025

వాళ్లే T20 వరల్డ్ కప్‌ ఓపెనర్స్‌ అవుతారు: రైనా

image

T20 వరల్డ్ కప్-2026 ఓపెనర్లుగా ఎవరుంటే బాగుంటుందో ఓ పాడ్ కాస్ట్‌లో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పారు. ‘ఓపెనర్స్‌లో ఒకరు యశస్వీ జైస్వాల్. రెండో వ్యక్తిగా ప్రియాన్ష్, అభిశేక్ శర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. నేను అభిశేక్‌ను ఎంచుకుంటాను. గిల్ కెప్టెన్‌గా, మూడో స్లాట్‌లో ఉండాలి’ అని తెలిపారు. గిల్, శాంసన్‌ని ఎంచుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.