News August 30, 2025

కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

image

జమ్మూకశ్మీర్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా రియాసీ జిల్లాలోని మహోరే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో ఏడుగురు మరణించారు. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అంతకుముందు రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌తో <<17559722>>ముగ్గురు<<>> మరణించారు.

Similar News

News August 31, 2025

మోదీ-ట్రంప్ మధ్య విభేదాలకు కారణం ఇదేనా?

image

మోదీకి జూన్ 17న కాల్ చేసిన ట్రంప్.. భారత్-పాక్ సీజ్‌ఫైర్ గురించి ప్రస్తావించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తాను యుద్ధాన్ని ముగించానని, పాక్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబోతుందని చెప్పినట్లు రాసుకొచ్చింది. దాన్ని మోదీ తిరస్కరించారని, సీజ్‌ఫైర్‌లో మూడో దేశం ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారని తెలిపింది. నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ చేసేందుకు ఇష్టపడకపోవడంతో ట్రంప్ అలిగినట్లు వివరించింది.

News August 30, 2025

ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు: CM

image

AP: కుప్పానికి కృష్ణమ్మను తీసుకొచ్చేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడ్డానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో ఈ ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పారు. 738 కి.మీ. దూరం నుంచి కృష్ణమ్మ కుప్పానికి రావడంతో ప్రజల్లో ఆనందం చూసి ఎంతో సంతోషం కలిగిందన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇదో మరిచిపోలేని రోజని తెలిపారు.

News August 30, 2025

వాళ్లే T20 వరల్డ్ కప్‌ ఓపెనర్స్‌ అవుతారు: రైనా

image

T20 వరల్డ్ కప్-2026 ఓపెనర్లుగా ఎవరుంటే బాగుంటుందో ఓ పాడ్ కాస్ట్‌లో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పారు. ‘ఓపెనర్స్‌లో ఒకరు యశస్వీ జైస్వాల్. రెండో వ్యక్తిగా ప్రియాన్ష్, అభిశేక్ శర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. నేను అభిశేక్‌ను ఎంచుకుంటాను. గిల్ కెప్టెన్‌గా, మూడో స్లాట్‌లో ఉండాలి’ అని తెలిపారు. గిల్, శాంసన్‌ని ఎంచుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.