News August 30, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,640 పెరిగి రూ.1,04,950కు చేరింది. కాగా 5 రోజుల్లో రూ.3,440 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,500 ఎగబాకి రూ.96,200 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,100 పెరిగి రూ.1,31,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News August 31, 2025
ఈనాటి ముఖ్యాంశాలు

* ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది: కుప్పంలో సీఎం
* TG: రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక
* బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పొన్నం
* యూరియా కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం: హరీశ్‌రావు
* చైనాలో మోదీకి రెడ్ కార్పెట్ వెల్‌కమ్
* తెలంగాణ వరద బాధితులకు బాలకృష్ణ రూ.50 లక్షల సాయం
* అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నం(94) కన్నుమూత
News August 31, 2025
పోర్న్ సైట్‌లో మెలోనీ మార్ఫింగ్ ఫొటోలు

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మార్ఫింగ్ ఫొటోలు పోర్న్ సైట్‌లో దర్శనమివ్వడం తీవ్ర దుమారం రేపింది. 7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆ సైట్‌లో మెలోనీతోపాటు పలువురు ప్రముఖుల ఫొటోలూ ఉన్నాయి. తనతోపాటు చాలామంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంపై మెలోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి చర్యలు చాలా అసహ్యకరం. బాధిత మహిళలందరికీ నా మద్దతు ఉంటుంది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’ అని హెచ్చరించారు.
News August 31, 2025
మోదీ-ట్రంప్ మధ్య విభేదాలకు కారణం ఇదేనా?

మోదీకి జూన్ 17న కాల్ చేసిన ట్రంప్.. భారత్-పాక్ సీజ్‌ఫైర్ గురించి ప్రస్తావించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తాను యుద్ధాన్ని ముగించానని, పాక్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబోతుందని చెప్పినట్లు రాసుకొచ్చింది. దాన్ని మోదీ తిరస్కరించారని, సీజ్‌ఫైర్‌లో మూడో దేశం ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారని తెలిపింది. నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ చేసేందుకు ఇష్టపడకపోవడంతో ట్రంప్ అలిగినట్లు వివరించింది.