News August 30, 2025

KMR: 32,907 ఎకరాల పంట నీట మునిగింది

image

కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల 32,907 ఎకరాల పంట నీట మునిగిందని అధికారులు ప్రాథమిక అంచనాలో వెల్లడించారు. వరద నీరు పొలాలను చుట్టుముట్టడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ప్రస్తుతం ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే అని, నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే నష్టంపై పూర్తిస్థాయి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Similar News

News August 31, 2025

GDK: ‘ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలి’

image

ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ టీ.శ్రీనివాస రావు అన్నారు. శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ఎవరైనా ర్యాగింగ్‌ పాల్పడితే జైలు శిక్ష, విద్యా సంస్థ నుంచి సస్పెండ్‌ చేయడం తప్పదన్నారు. చట్టాలపై అవగాహన కల్పించారు.

News August 31, 2025

ఈనాటి ముఖ్యాంశాలు

image

* ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది: కుప్పంలో సీఎం
* TG: రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక
* బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పొన్నం
* యూరియా కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం: హరీశ్‌రావు
* చైనాలో మోదీకి రెడ్ కార్పెట్ వెల్‌కమ్
* తెలంగాణ వరద బాధితులకు బాలకృష్ణ రూ.50 లక్షల సాయం
* అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నం(94) కన్నుమూత

News August 31, 2025

కరీంనగర్: స్థానిక పోరు ప్రచారానికి సమయం లేదు మిత్రమా..!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు TG కేబినెట్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్డినెన్సు ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి, SEP మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, నెలాఖరులోపు ఎన్నికల పూర్తికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆశావాహుల ఎన్నికల ప్రచారానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఇలా ఐతే ఖర్చు తగ్గుతుందని అభ్యర్థుల ఆశాభావం. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.