News August 30, 2025
కుటుంబసభ్యులను కోల్పోయాం.. వారిని భర్తీ చేయలేం: RCB

బెంగళూరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి RCB యాజమాన్యం తాజాగా పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ట్వీట్ చేసింది. ‘RCB కుటుంబంలోని 11 మందిని కోల్పోయాం. వారు మనలో భాగం. ఎన్ని డబ్బులిచ్చినా వారి స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ మొదటి అడుగుగా రూ.25లక్షలు ఇచ్చాం’ అని ట్వీట్ చేసింది. ఘటన జరిగిన 3 నెలల తర్వాత RCB ఈమేరకు స్వయంగా స్పందించింది.
Similar News
News February 3, 2026
Trade Deal: మనపై 18% టారిఫ్స్.. వాళ్లపై ‘సున్నా’ సుంకాలా?

ట్రేడ్ డీల్‌లో భాగంగా US వస్తువులపై ఇండియా సున్నా టారిఫ్స్ విధిస్తుందని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు. దీనిపై భారత ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. ఒకవేళ చేసినా.. వేటికి జీరో టారిఫ్స్ వర్తిస్తాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బహుశా కొన్ని సెలక్టెడ్ అమెరికన్ ప్రొడక్ట్స్‌పై దశలవారీగా సుంకాలు భారీగా తగ్గిస్తామన్న హామీ లభించిందని ట్రంప్ ఉద్దేశం అయి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
News February 3, 2026
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ పోస్టులు!

మీకు భారత వైమానిక దళంలో చేరాలనే కల ఉందా? అయితే వెంటనే https://iafrecruitment.edcil.co.in సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఇంటర్, డిప్లొమా, పదో తరగతి అర్హత ఉన్నవారు FEB 8 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2006 జనవరి 1 నుంచి 2009 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండటం తప్పనిసరి. రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
News February 3, 2026
టారిఫ్‌ల తగ్గింపుతో ఆక్వా రైతులకు ఆదాయం: అచ్చెన్న

AP: అమెరికా టారిఫ్‌లను 25 నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల ఆక్వా రంగానికి ఉపశమనం లభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ దేశానికి సముద్ర ఆహార ఎగుమతులు 15% వరకు పెరుగుతాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో సీ ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన రాయితీలు ఈ రంగానికి అదనపు మద్దతును అందిస్తాయని తెలిపారు. దీంతో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.


