News August 30, 2025
సంగారెడ్డి: ‘శాంతి భద్రతలకు సహకరించండి’

సంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News August 31, 2025
భారత డ్రోన్స్‌ను US, చైనా కనిపెట్టలేవు: రాజ్‌నాథ్

దేశంలో ‘న్యూ టెక్నలాజికల్ రెవల్యూషన్’కు ఇండియన్ డ్రోన్స్ సింబల్‌గా మారాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్లదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. ‘నేటి యువత కంపెనీ ఏర్పాటు చేయడం కాదు.. సరికొత్త ఆలోచనలతో డిఫెన్స్ సెక్టార్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఇండియన్ డ్రోన్స్ ఎగిరినప్పుడు.. అమెరికా, చైనా కూడా వాటిని కనిపెట్టలేవు. ఇది చాలా గొప్ప విషయం’ అని వ్యాఖ్యానించారు.
News August 31, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 31, 2025
నేడు, రేపు వర్షాలు

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, MHBD, WGL, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.