News August 30, 2025
భద్రకాళి ఆలయానికి నూతన ఈవో

వరంగల్ భద్రకాళి ఆలయానికి నెల తిరగకముందే నూతన ఈవోను రాష్ట్ర దేవాదాయ శాఖ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవో సునీతను తప్పించి, సీనియర్ అధికారిణి సంధ్యారాణిని ఈవోగా నియమించింది. గతంలో ఐదున్నర ఏళ్ల పాటు పనిచేసిన సునీత నెల రోజులు తిరగకముందే ఆమె స్థానాన్ని మార్చడంపై రాజకీయ నేతల హస్తం ఉందని మాట్లాడుకుంటున్నారు. సునీతపై రాష్ట్ర ఎండోమెంట్ అధికారులకు సైతం కొన్ని ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
Similar News
News August 31, 2025
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే!

AP: సాధారణంగా మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలను ఈసారి FEBలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సిద్ధమైంది. CBSEతో పాటు ఎగ్జామ్స్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు తగినట్లు షెడ్యూల్‌లో మార్పులు చేసింది. తొలుత సైన్స్ స్టూడెంట్స్‌కు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు స్టార్ట్ అవుతాయి. తర్వాత లాంగ్వేజ్, చివర్లో ఆర్ట్స్ గ్రూప్ వారికి ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రాక్టికల్స్ నిర్వహణపై క్లారిటీ రావాల్సి ఉంది.
News August 31, 2025
అంచనాలకు మించి దూసుకెళ్తున్న భారత్

భారత ఎకానమీ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో <<17555786>>GDP<<>> వృద్ధి రేటు 7.8% నమోదవడమే ఇందుకు నిదర్శనం. మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్లు రాణించడం కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో అతిపెద్ద ఎకానమీగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో స్థానానికి చేరుతుందని అధికారులు వెల్లడించారు. అప్పటివరకు జీడీపీ $7.3 ట్రిలియన్లకు చేరుతుందని తెలిపారు.
News August 31, 2025
NZB: NDRF, SDRF సేవలు భేష్..

ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలలో NDRF, SDRF బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగామన్నారు.