News August 30, 2025
NZB: 21 మండలాల్లో 41,098 ఎకరాల పంట నష్టం

కురిసిన వర్షాలకు నిజామాబాదు జిల్లాలోని 21 మండలాల్లో 41,098 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసిందని అధికారులు తెలిపారు. ఇందులో 14,663 మంది రైతులకు సంబంధించి 28,131 ఎకరాల వరి, 5,418 మందికి చెందిన 12,054 ఎకరాల సొయా, 382 మందికి చెందిన 565 ఎకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చామని పేర్కొన్నారు.
Similar News
News August 31, 2025
NZB: NDRF, SDRF సేవలు భేష్..

ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలలో NDRF, SDRF బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగామన్నారు.
News August 31, 2025
NZB: ఉమ్మెడ బ్రిడ్జిని పరిశీలించిన సీపీ

నందిపేట్ ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన స్థలాన్ని సీపీ సాయి చైతన్య శనివారం సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే లో చూడాలని పోలీసులకు ఆదేశించారు.
News August 30, 2025
NZB: చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఆనుకుని దిగువన గల పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంబూషియా చేప పిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్ ను సందర్శించారు. గంబూషియా చేప పిల్లలను పెద్ద సంఖ్యలో పెంచాలని నిర్వాహకులకు సూచించారు.