News August 30, 2025

ప్రతి చెరువుకూ నీళ్లిచ్చే బాధ్యత నాది: చంద్రబాబు

image

AP: అసత్యాలు చెప్పడంలో YCP దిట్టని చిత్తూరు(D) పరమసముద్రం బహిరంగ సభలో CM చంద్రబాబు విమర్శించారు. ‘గేట్లతో సెట్టింగులేసి నీళ్లు తెచ్చినట్లు డ్రామాలాడటం చూశాం. మల్యాలలో మొదలైతే పరమసముద్రానికి నీళ్లు తెచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లతో నీళ్లు తరలిస్తున్నాం. కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలొచ్చాయి. రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత నాదని ముందే చెప్పా. ప్రతి చెరువుకూ నీళ్లిస్తాం’ అని తెలిపారు.

Similar News

News August 31, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు <<17568780>>సన్నాహకాలు<<>> మొదలయ్యాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కొందరు ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేస్తుండగా, మరికొందరివి చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకానికి బ్రేక్ పడుతుందేమో? డబ్బులు రాకపోతే నిర్మాణమెలా? అన్న సందేహాలతో సతమతమవుతున్నారు. అయితే ఆందోళన అవసరం లేదని, ఎన్నికల తర్వాత కూడా పథకం కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

News August 31, 2025

పర్యాటక రంగంలో రూ.12వేల కోట్ల పెట్టుబడులు: దుర్గేశ్

image

AP: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఇప్పటివరకు ఈ రంగానికి ₹12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. టూరిస్టు సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నామని, లంబసింగి, వంజంగి, అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అటు విశాఖ MGM గ్రౌండ్స్‌లో SEP 5 నుంచి 3 రోజుల పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది.

News August 31, 2025

ఉద్యోగుల ఖాతాల్లోకి పెండింగ్ బిల్లులు

image

TG: ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి దాదాపు ₹700 కోట్లను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఉద్యోగుల సప్లిమెంటరీ వేతన బిల్లులు ₹392 కోట్లు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కింద మరో ₹308 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఇంకా ₹10వేల కోట్ల వరకు బిల్లులు రావాలని తెలిపారు. కాగా ఉద్యోగుల బిల్లులకు ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లిస్తామని జూన్‌లో ప్రభుత్వం ప్రకటించింది.