News August 30, 2025
ఇలాంటి వాట్సాప్ గ్రూపులు అన్ని ఊర్లలో ఉంటే..!

ఎమర్జెన్సీలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని సంగారెడ్డిలో ‘నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్’ పేరిట 8 ఏళ్లుగా వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ, ఎవరికి రక్తం అవసరమైనా దాంట్లో మెసేజ్ చేస్తే చాలు దగ్గరున్నవాళ్లు అక్కడికి వస్తారు. ఇలాంటి వాట్సాప్ గ్రూప్స్ ప్రతి గ్రామానికీ ఉంటే ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడటమే కాకుండా ఊరి ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయి.
Similar News
News November 24, 2025
ఐబొమ్మ రవి.. విచారణలో సంచలన విషయాలు!

ఐబొమ్మ రవి మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇవాళ అతడి మాజీ భార్యనూ పోలీసులు విచారించారు. తనతో పాటు కూతురిని చిత్రహింసలకు గురిచేశాడని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. రవి ప్రవర్తన నచ్చకనే విడాకులు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారని వార్తలు వస్తున్నాయి. స్నేహితుడు నిఖిల్‌కు నెలకు రూ.50వేలు ఇచ్చి ఐబొమ్మ సైట్ పోస్టర్లు డిజైన్ చేయించుకున్నట్లుగా గుర్తించారు.
News November 24, 2025
కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.
News November 24, 2025
టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై రవిశాస్త్రి ఫైర్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఫైరయ్యారు. రెండో టెస్టులో సుందర్‌ను ఎనిమిదో స్థానంలో పంపడం సరికాదన్నారు. ఈ ఆలోచన అర్థం లేనిదని మండిపడ్డారు. కోల్‌కతా(తొలి) టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించి, వారిలో ఒకరికి ఒకే ఓవర్ ఇవ్వడమూ సరైన నిర్ణయం కాదన్నారు. కనీసం స్పెషలిస్టు బ్యాటర్‌తో వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.


