News August 30, 2025
తుర్కపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన పర్వతం రాజు(20) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతం వాసుదేవ్ కుమారుడు రాజు కోల్తూరులో ఓ ఫార్మ కంపెనీలో పని చేస్తున్నాడు. విధులకు వెళుతుండగా వెనుకనుంచి కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. రాజు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News August 31, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.122, మాంసం రూ.177 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.201 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News August 31, 2025
KNR: యువతకు FREE TRAINING

ఆదివాసి యువతకు ఉపాధి కోసం స్వామి రామానంద తీర్థ రూరల్ సంస్థవారు 105 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
1. 10th పాసైనవారికి ఆటోమొబైల్, సోలాస్ సిస్టం ఇన్‌స్టలేషన్‌లో
2. INTER పాసైనవారికి కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో
3. డిగ్రీ పాసైనవారికి అకౌంట్స్ అసిస్టెంట్ TALLYలో శిక్షణ ఇస్తారు.
సర్టిఫికేట్లు, ఫొటోలు, ఆధార్, రేషన్ కార్డులతో యాదాద్రి(D) పోచంపల్లి మం. జలాల్‌పూర్లోని సంస్థలో సంప్రదించవచ్చు. రేపే LAST DATE.
News August 31, 2025
కుప్పంలో బుల్లెట్ బైక్ నడిపిన మంత్రి నిమ్మల

కుప్పంలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు బుల్లెట్ బైక్‌పై సీఎం బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. పరమసముద్రం వద్ద హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి ఇచ్చే బహిరంగ సభకు వెళ్లగా.. మంత్రి నిమ్మల బుల్లెట్ బైక్‌పై ఈ సమావేశానికి వచ్చారు. టీడీపీ శ్రేణులకు అభివాదం ఆయన చేశారు.