News August 30, 2025
ట్రెండింగ్: TRUMP IS DEAD

X (ట్విటర్)లో TRUMP IS DEAD అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్రంప్ వైట్‌హౌస్‌లో కనిపించకపోవడంతో కొందరు X వేదికగా ఈ పోస్టులు చేస్తున్నారు. ట్రంప్ CVI వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనికి తోడు దేశంలో ‘టెర్రిబుల్ ట్రాజెడీ’ సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలకు సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రూమర్లను వైట్‌హౌస్ ఖండించింది.
Similar News
News August 31, 2025
వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

AP: అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలన, పథకాల అమలు, బనకచర్ల ప్రాజెక్టు తదితర అంశాలపై సభలో చర్చించే అవకాశముంది.
News August 31, 2025
అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు

TG: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే <<17479379>>ప్రభుత్వానికి లేఖ<<>> రాశామని, అయినా స్పందన రాలేదని ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి. బిల్లుల పెండింగ్‌తో చిన్న, మధ్యస్థాయి ఆస్పత్రులు మూసివేసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News August 31, 2025
విద్యార్థులకు రాగిజావ.. 40% ఖర్చు భరించనున్న ప్రభుత్వం!

TG: సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వారానికి 3 రోజులపాటు రాగిజావను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అయ్యే ఖర్చులో 40% భరించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. మిగతా ఖర్చును శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు భరిస్తుంది. ట్రస్టుతో కలిసి గత రెండేళ్లుగా ప్రభుత్వం రాగిజావను అందిస్తోండగా, ఈ ఏడాది ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులకు మళ్లీ రాగిజావ పంపిణీ ప్రారంభం కానుంది.