News August 30, 2025
ధోనీకి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన BCCI?

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు క్రిక్ బ్లాగర్ పేర్కొంది. 2021 టీ20 వరల్డ్ కప్‌కు ధోనీ టీమ్ ఇండియా మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈసారి అలా పార్ట్ టైమ్ కాకుండా ఫుల్ టైమ్ మెంటర్‌గా ఉండాలని ధోనీని కోరినట్లు బీసీసీఐ ప్రతినిధి తెలిపారని వివరించింది. సీనియర్, జూనియర్ జట్లు సహా మహిళల టీమ్స్‌కూ MSDని మెంటర్‌గా వ్యవహరించాలని కోరినట్లు తెలిపింది.
Similar News
News August 31, 2025
బీసీ బిల్లుకు BJP పూర్తి మద్దతు: పాయల్ శంకర్

TG: బిల్లుపై బీసీలకున్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ‘42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ చర్చించాలి. మీ చేతిలోని అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేంటి ఇబ్బంది? మంత్రివర్గంలో BCల సంఖ్య ఎంత? బీసీల సంక్షేమం కోసం ఏడాదికి రూ.20 వేలకోట్లు చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికీ 4 పైసలు రాలేదు’ అని వ్యాఖ్యానించారు.
News August 31, 2025
బార్లకు తగ్గిన దరఖాస్తుల కిక్కు

APలో సగానికి పైగా బార్లకు మళ్లీ దరఖాస్తులు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 840 బార్లకు మూడేళ్ల పరిమితితో నోటిఫికేషన్ ఇవ్వగా 388 బార్లకు నిన్న లాటరీలు తీసి, టెండర్లు ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఒక బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రాకపోవడంతో 452 బార్లకు లాటరీ తీయలేదు. 37 బార్లకు ఒకట్రెండు దరఖాస్తులే రావడంతో రేపటి వరకు గడువు పొడిగించారు. వీటికి నాలుగేసి దరఖాస్తులొస్తే ఎల్లుండి లాటరీ తీస్తారు.
News August 31, 2025
Way2News EXCLUSIVE… కాళేశ్వరం రిపోర్ట్

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 665 పేజీలతో ప్రవేశపెట్టిన ఈ రిపోర్టును <