News April 2, 2024
గద్వాల: బావిలో ఈతకు వెళ్లి బాలిక మృతి

గద్వాల జిల్లా ధరూర్ మండలం గార్లపాడులో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన మమత(11) నేడు గ్రామ శివారులోని బావిలో ఈతకు స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈత కొడుతున్న మమత ఎంతకీ బయటకు రాకపోవడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు వచ్చి బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News September 11, 2025
భారీ వర్షం.. జానంపేటలో అత్యధికం

మహబూబ్‌నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూసాపేట మండలంలోని జానంపేటలో అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డాకులలో 33.5, దేవరకద్రలో 31.5, చిన్నచింతకుంటలో 22.0, మహమ్మదాబాద్‌లో 11.0, కోయిలకొండలో 4.5, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 3.5, కౌకుంట్లలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
News September 11, 2025
తెలుగు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

ఈ ఎడాదికి గాను పీజీలో చేరెందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ డైరెక్టర్ డా.బి.రాధ Way2Newsతో తెలిపారు. ఈనెల 19, 20న ఉ.11.00 గం. – సా.4.30 వరకు బాచుపల్లిలో దరఖాస్తులు చేసుకోవాలని, ఆసక్తి గల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, 3 ఫోటోలు, 3 సెట్ జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్ష రాయని వారు రూ.600 డీడీను సమర్పించాలన్నారు.
News September 11, 2025
మహిళా సాధికారత కమిటీ సమావేశంలో డీకే అరుణ

ఢిల్లీలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో మహిళా సాధికారత కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈనెల 14, 15న మహిళా సాధికారత కమిటీ స్టడీ టూర్ నేపథ్యంలో APలో తిరుపతి వేదికగా కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. 2025లో ఎన్నికైన సభ్యుల పోర్టల్ ద్వారా క్షేత్ర స్థాయి సమాచారం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు.