News August 30, 2025
బాబు కడితే ఇల్లా.. జగన్ కడితే ప్యాలెసా?: గుడివాడ

AP: <<17552693>>రుషికొండ<<>>లో Dy.CM పవన్ కళ్యాణ్ డ్రామాలాడారని YCP నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సీలింగ్ కట్ చేసి, అక్కడ ఫొటోలు దిగారని ఆయన ఆరోపించారు. ‘రుషికొండ భవనాలను వాడుకునేందుకు చంద్రబాబు, పవన్, లోకేశ్ పోటీపడుతున్నారు. చంద్రబాబు రూ.200 కోట్లతో హైదరాబాద్‌లో ఇల్లు కడితే అది పూరి గుడిసె. కానీ జగన్ ఇల్లు కట్టుకుంటే మాత్రం అది ప్యాలెసా’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News August 31, 2025
బాలయ్య ‘అఖండ-2’ సినిమాకి భారీ ధర?

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో రూపొందుతోన్న ‘అఖండ-2’ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. జియో హాట్‌స్టార్ సంస్థ రూ.85 కోట్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. బాలకృష్ణ సినిమాల్లో ఇదే రికార్డు ధర అని చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉంది.
News August 31, 2025
కేరళకు బయల్దేరిన సీఎం రేవంత్

TG: అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ కేరళకు బయల్దేరారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహిస్తున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సా.4 గంటలకు సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగే చర్చలో పాల్గొంటారు.
News August 31, 2025
బీసీ బిల్లు ఆమోదం కాకుండా BRS లాబీయింగ్: CM రేవంత్

TG: BRS నేతల మాటలు నమ్మి గవర్నర్ BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపించారని CM రేవంత్ అన్నారు. BRS తెరవెనక లాబీయింగ్ చేసి రాష్ట్రపతికి పంపేలా చేసిందని ఆరోపించారు. ‘సభలో గందరగోళం సృష్టించి బిల్లు ఆమోదం పొందకుండా మాట్లాడుతున్నారు. BRSకు ప్రజలు ఇప్పటికే శిక్ష విధించారు. అయినా మారకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మమ్మల్ని అభినందించి ఉంటే KCR పెద్దరికం పెరిగి ఉండేది’ అని వ్యాఖ్యానించారు.