News August 30, 2025

ఆడపిల్లలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు: MP

image

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. భీమారంలో ఓ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే దృఢమైన సంకల్పం, అంకితభావంతో కష్టపడి పనిచేయాలన్నారు. ఆడపిల్లలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు.

Similar News

News August 31, 2025

ఒకే గ్రామంలో 8 మందికి టీచర్ ఉద్యోగాలు

image

దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 8 మంది డీఎస్సీలో సత్తా చూపారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని, వారి తల్లిదండ్రులను బీసీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బుజ్జమ్మ సన్మానించారు. తన ఊరిలో 8 మంది ఉపాధ్యాయులుగా ఎంపికవ్వడం ఆనందంగా, గర్వంగా ఉందని ఆమె తెలిపారు.

News August 31, 2025

మైనర్లకు వాహనాలిస్తే రూ.లక్ష జరిమానా!

image

TG: 18 ఏళ్లు నిండకుండానే బైకులతో రోడ్లపై రయ్ రయ్ అంటూ మైనర్లు దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో తమ పిల్లలు ప్రాణాలు కోల్పోకూడదని జనగామ(D) నాగిరెడ్డిపల్లి గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపితే పెరెంట్స్‌కు రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించింది. ప్రమాదాల నివారణకు బాధ్యతతో ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం అన్ని గ్రామాలకు ఆదర్శనీయం.

News August 31, 2025

WNP: బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి: మంత్రి

image

బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘బీసీ బిల్లుకు బీఆర్ఎస్, బీజెపి సహకరించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలి. కాంగ్రెస్ కేంద్రంలో పవర్లో ఉన్నప్పుడే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లభించింది. బీసీ మంత్రిపై బీఆర్ఎస్ బీసీ నేత తప్పుగా మాట్లాడడం సరికాదు’ అని అన్నారు.