News August 30, 2025

మహానగరంలో శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు

image

వచ్చే నెల 6న జరిగే గణపతి శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్టాటిక్ క్రేన్లు: 134, మొబైల్ క్రేన్లు: 269, హుస్సేన్‌సాగర్ వద్ద పడవలు 9, డీఆర్ఎఫ్ 16 టీములు, గజ ఈతగాళ్లు: 200, గణేశ్ యాక్షన్ టీమ్స్: 160, పారిశుద్ధ్య కార్మికులు 14,486 మంది, మినీ టిప్పర్లు: 102, జేసీబీలు 125, స్వీపింగ్ యంత్రాలు 30, మొబైల్ టాయిలెట్స్ 309, లైటింగ్ పాయింట్లు 56,187, వైద్య శిబిరాలు 7 ఏర్పాటు చేశారు.

Similar News

News September 3, 2025

కాంక్రీట్ జంగిలే.. HYDకు కారణభూతం

image

2020లో వచ్చిన వరదలు HYD, అటు శివారులను అతలాకుతలం చేశాయి. ఒకేరోజు 30 సెంటీమీటర్ల వర్షం నమోదు కావటంపై నాటి నుంచి IMD అధ్యయనం చేసి ఇటీవల నివేదిక రూపొందించింది. వాతావరణంలో మార్పులకు తోడు HYDలో వస్తున్న స్థానిక మార్పుల ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు, క్లౌడ్ బరస్ట్‌కు దారితీస్తోందని పేర్కొంది. HYD మొత్తం కాంక్రీట్ జంగిల్ కావడం, మరోవైపు పొల్యూషన్, పట్టణీకరణ ప్రభావమూ ఉన్నట్లు ఇది తేల్చింది.

News September 3, 2025

IT కారిడార్‌కు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు: సజ్జనార్

image

నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రయాణికులకు సేవలందించేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు నడపనున్నారు. పలు ప్రధాన ప్రాంతాల నుంచి వీటిని హైటెక్ సిటీకి నడిపేలా చర్యల తీసుకుంటున్నామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, హకీంపేట, బోడుప్పల్ నుంచి ఐటీ కారిడార్ (విప్రో, వేవ్ రాక్, కోకాపేట, టీహబ్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ)కు కనెక్టివిటీ పెంచుతామని వివరించారు.

News September 2, 2025

HYD: అందుబాటులోకి వచ్చిన హైడ్రా టోల్ ఫ్రీ నంబర్

image

హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీక‌రించ‌డానికి టోల్‌ఫ్రీ నంబ‌ర్ 1070 అందుబాటులోకి వ‌చ్చింది. 1070 నంబ‌ర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఈరోజు తెలిపారు. హైడ్రా ప్రజావాణికి రాలేని వారు చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గురైతే వెంట‌నే ఈ నంబర్‌కి కాల్ చేయవచ్చన్నారు.