News August 30, 2025
ఉక్రెయిన్‌కు టాప్ డీజిల్ సప్లయర్‌గా భారత్

ఉక్రెయిన్‌కు భారత్ టాప్ డీజిల్ సప్లయర్‌గా నిలిచినట్లు ఆయిల్ మార్కెట్ నిపుణులు తెలిపారు. 2025 జులైలో రోజుకు 2,700 టన్నుల డీజిల్ దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు. 2024 జులైలో 1.9% ఉన్న దిగుమతులు ఒక్క ఏడాదిలోనే 15.5%కి ఎగబాకాయన్నారు. రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు కావాల్సిన ఎకానమీ సపోర్ట్‌కు ఈ డీజిల్ దిగుమతులు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
Similar News
News August 31, 2025
భారతీయులు చేతితోనే ఎందుకు తింటారంటే?

ఇప్పటికీ మెజారిటీ భారతీయులు చేతితోనే ఆహారం తింటారు. ఆహారానికి, చేతికి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఆహారం ఉష్ణోగ్రత, స్వభావం తినడానికి ముందే తెలుసుకోవచ్చు. చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు ప్రతీకలు. చేత్తో తినడం వల్ల ఈ శక్తులు ఆహారంతో కలిసి సులభంగా జీర్ణమవుతుంది. చేతి వేళ్లలోని నరాల కొసలు కూడా జీర్ణక్రియలో కీలకం. అలాగే చేతితో తింటే ఎంతకావాలో అంతే తింటాం. ఇది స్పూన్, ఫోర్క్ ద్వారా సాధ్యం కాదు.
News August 31, 2025
డేవిడ్ వార్నర్ న్యూ లుక్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. షార్ట్ హెయిర్‌తో ఉండే వార్నర్ ఇలా లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చారు. ‘కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వస్తోంది’ అంటూ ఓ ఫొటోని ఇన్‌స్టా స్టోరీగా పెట్టారు. పొడవైన జుట్టుతో కనిపించగానే.. వార్నర్ మళ్లీ ఏదైనా మూవీలో నటిస్తున్నారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన నితిన్ ‘రాబిన్ హుడ్’ మూవీలో నటించిన విషయం తెలిసిందే.
News August 31, 2025
కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో చర్చ.. ఉత్కంఠ

TG: ఈ మధ్యాహ్నం కేరళకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. నివేదికలోని ప్రధాన అంశాలతో మంత్రి ఇప్పటికే నోట్ రెడీ చేసుకున్నారు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.