News August 30, 2025

MDCL: డిజేలు నడపొద్దు: DCP

image

మల్కాజ్‌గిరి పరిధిలో డీజే ఆపరేటర్లకు డీసీపీ పద్మజ వివిధ పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు నడపొద్దని, ఒకవేళ నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరగటానికి అందరు సహకరించాలని డీసీపీ కోరారు.

Similar News

News August 31, 2025

బుడమేరు ప్రణాళిక ఇదే.. అమలయ్యేది ఎప్పుడో?

image

బుడమేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అధికారులు నాలుగు డీపీఆర్‌లను సిద్ధం చేశారు. పూడికతీతతో పాటు, వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 25 కి.మీల ప్రత్యామ్నాయ కాలువ, 36 కి.మీల అండర్ టన్నెల్ నిర్మాణం, కొల్లేరు-ఉప్పుటేరు కాలువ వెడల్పు వంటివి ఈ ప్రణాళికల్లో ఉన్నాయి. రూ. 4,864 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా, ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు కాలేదు.

News August 31, 2025

1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సెప్టెంబర్ 1 ఉదయం 10 గంటల నుంచి స్పెషల్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు వారి అర్జీలను కలెక్టరేట్‌లో అందించే అవసరం లేకుండా https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.

News August 31, 2025

మార్కాపురం మీదుగా తిరుపతికి స్పెషల్ ట్రైన్!

image

జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి నవంబర్ 25 వరకు ఈ రైలు జిల్లా గుండా తిరుపతికి చేరుకోనుంది. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి రాత్రి 9.10 గంటలకు బయలుదేరి జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు స్టేషన్ల మీదుగా నంద్యాలకు చేరుతుంది. అక్కడి నుంచి తిరుపతికి వెళుతుందని అధికారులు తెలిపారు.