News August 30, 2025

HYDలో ఫంక్షన్ కోసం పేదోడి టెన్షన్!

image

ఇంట్లో ఫంక్షన్‌ ఉంటే HYDలో పేదోడు ఓ ఫంక్షన్ చేయాలంటే కొండంత భారంగా మారింది. ఇందుకోసం అప్పు మీద అప్పు చేయాల్సిన పరిస్థితి. HYDలో ఒక ఫంక్షన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువుకు వలస వచ్చిన ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. HYDలో ప్రభుత్వం ప్రతి డివిజన్‌లో కనీసం 2 ఫంక్షన్ హాల్స్ నిర్మించి, తక్కువ ధరకు ఉంచేలా చూడాలని కోరుతున్నారు.

Similar News

News August 31, 2025

పెద్దపల్లి: సెప్టెంబర్ 2న ఫోటో స్టూడియోలు బంద్

image

ముడి సరుకుల ధరలు, నిర్వహణ వ్యయం అధికమవుతున్న నేపథ్యంలో కొత్త రేట్ల అమలుకు డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్ 2న పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియోలు బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తమ ఆర్థిక పరిస్థితుల బలోపేతానికి సహకరించాలని జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు.

News August 31, 2025

HYD: కృష్ణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ లైన్ మరమ్మతులు

image

HYD నగరానికి నీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఫేజ్-3 పంపింగ్ మెయిన్‌లో 1400 MM డయా పైప్‌‌లైన్‌‌పై, రాజేంద్రనగర్ PVNR ఎక్స్‌ప్రెస్‌వే వద్ద భారీ నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు చేపడుతున్నారు. అలాగే.. అత్తాపూర్ మూసీ వంతెన వద్ద 300 MM డయా స్కేవర్ వాల్వ్ ఎక్స్‌టెన్షన్ పైప్‌లో లీకేజీ పనులు నిర్వహిస్తున్నట్లు జలమండలి పేర్కొంది.

News August 31, 2025

కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో చర్చ.. ఉత్కంఠ

image

TG: ఈ మధ్యాహ్నం కేరళకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. నివేదికలోని ప్రధాన అంశాలతో మంత్రి ఇప్పటికే నోట్ రెడీ చేసుకున్నారు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.