News August 30, 2025
అసెంబ్లీలో PPT సంప్రదాయం లేదు: Dy.CM భట్టి

ఖమ్మం: అసెంబ్లీలో ప్రతిపక్షాలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(పీపీటీ) చేసే సంప్రదాయం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. BRS హయాంలో తమ పీపీటీకి అవకాశం కల్పించాలని లేఖ ఇచ్చినప్పటికీ, అప్పుడు అవకాశం ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వం రూ.6,500 కోట్ల వడ్డీ కట్టలేదనే బీఆర్ఎకస్ వాదన సరైనది కాదని పేర్కొన్నారు.
Similar News
News August 31, 2025
రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం మండలం, డివిజనల్, మున్సిపల్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో యథావిధిగా ఉదయం 10 గంటలకు ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ప్రజలు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇంటి నుంచే ఫిర్యాదు చేయొచ్చన్నారు. PGRSను ప్రజలు వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
News August 31, 2025
పుజారాను మెచ్చుకుంటూ మోదీ లేఖ

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు <<17502622>>పుజారా<<>> వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ PM మోదీ లేఖ రాసినట్లు పుజారా వెల్లడించారు. ఆయన పంపిన లేఖను SMలో పంచుకున్నారు. సౌరాష్ట్రతో అనుబంధం మొదలు AUSలో డేంజరస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడం వరకు ప్రతి అంశాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు. పుజారా కుటుంబం చేసిన త్యాగాలనూ ప్రస్తావించారు. తనకు లేఖ రాయడంపై మోదీకి పుజారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News August 31, 2025
సిరిసిల్ల: వరద బాధితులకు బండి సంజయ్ ఆర్థిక సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరదలతో నష్టపోయిన బాధితులకు ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విడుదల చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సిరిసిల్ల పట్టణంలో బీజేపీ శ్రేణులు ఆదివారం ప్రకటన విడుదల చేశాయి. ఈ ఆర్థిక సహాయాన్ని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందిస్తారని వారు పేర్కొన్నారు.