News August 30, 2025
శోభాయాత్రలు శాంతియుతంగా నిర్వహించాలి: SP

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రలు శాంతియుతంగా, సురక్షితంగా జరగాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. శోభాయాత్రల మార్గాల్లో ముందుగానే తనిఖీలు చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రధాన రహదారులు,కూడళ్లు,నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News August 31, 2025
KNR: అతిథి అధ్యాపకుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

SRR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుందని ప్రిన్సిపల్ కె.రామకృష్ణ తెలిపారు. హిందీ, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, బీసీఏ, జువాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్&మిషన్ లర్నింగ్‌లో ఖాళీలు ఉన్నాయన్నారు. పీజీలో 55% మార్కులు, NET, SET, Ph.D, టీచింగ్‌లో అనుభవం ఉన్న వారికి వెయిటేజీ ఉంటుంది. సెప్టెంబర్ 1వ తేదీ సా.4 గం.లలోపు తమ బయోడేటాతో పాటు దరఖాస్తులను సమర్పించాలి.
News August 31, 2025
ఖమ్మం: ACCIDENT.. మహిళ SPOT DEAD

రఘునాథపాలెం(M) వెంకటాయపాలెంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఏన్కూరు(M) కేసుపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తన భార్య లక్ష్మితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త వెంకటేశ్వర్లు గాయపడ్డారు. కళ్ల ముందే భార్య మరణించడంతో వెంకటేశ్వర్లు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
News August 31, 2025
శ్రీకాకుళం: రేపు కలెక్టర్ గ్రీవెన్స్

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.