News August 30, 2025
‘సుదర్శన చక్ర’ గేమ్ ఛేంజర్ అవుతుంది: రాజ్‌నాథ్

భారత్ అభివృద్ధి చేస్తున్న ‘సుదర్శన చక్ర’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రక్షణ రంగంలో గేమ్ ఛేంజర్ అవుతుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వచ్చే 10yrsలో ఇది దేశానికి భద్రతనిస్తుందని చెప్పారు. ‘ఫారిన్ ఎక్విప్‌మెంట్‌పై ఇండియా డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు. మిలిటరీ అప్‌గ్రేడ్‌కు, పవర్‌ఫుల్ ఏరో ఇంజిన్ తయారీకి ప్లాన్ చేశాం. యుద్ధాల్లో కీలకంగా మారుతున్న డ్రోన్లను దేశీయంగా అభివృద్ధి చేయడం ప్రారంభించాం’ అని తెలిపారు.
Similar News
News February 3, 2026
Trade Deal: ఇండియాలో కామన్ మ్యాన్‌కు ఏంటి?

USతో ట్రేడ్ డీల్ వల్ల భారత్‌లో సామాన్యుల జీవితాలపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, జెమ్స్-జువెలరీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చమురు, గ్యాస్ దిగుమతులు చౌకగా మారితే ఇంధన ధరలు తగ్గొచ్చు. రూపాయి బలపడి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. వ్యవసాయ రంగంపై క్లారిటీ రావాల్సి ఉంది.
News February 3, 2026
HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ 12-45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే గర్భం దాల్చకముందే దీన్ని తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. 9- 17 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.
News February 3, 2026
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

<


