News August 30, 2025

టమాటలో తలమాడు తెగులు – నివారణ

image

తామర పురుగుల వల్ల వ్యాప్తి చెందుతుంది. చిగురాకుల పైన ఈనెలు గోధుమ రంగులో మారి, ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్కల లేత కాండంపైనా గోధుమ చారలు కనిపించి మొక్క పూత, పిందె పట్టక ఎండిపోతుంది. నివారణకు తెగులు సోకిన మొక్కలను తొలగించి డైమిథోయేట్ 2mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారుమడిలో మడికి 250 గ్రా., నాటిన 10వ రోజు ఎకరాకు 10kgల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు వేసి పంటను రక్షించవచ్చు.

Similar News

News February 7, 2026

డెలివరీ తర్వాత కాళ్ల వాపులు తగ్గట్లేదా?

image

డెలివరీ తర్వాత మహిళల్లో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిల్లో ఒకటి కాళ్లవాపు. ప్రెగ్నెన్సీలో కాళ్లవాపు సహజమే కానీ డెలివరీ తర్వాత కూడా అలా ఉంటే జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. కాళ్లు ఎత్తులో పెట్టుకొని పడుకోవడం, మసాజ్ చేయడం, సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని నివారించడానికి ప్రొటీన్లు, పొటాషియం ఉన్న ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News February 7, 2026

మసీదుపై దాడి.. అసలేంటీ ఇస్లామిక్ స్టేట్?

image

పాక్‌లో చేసిన <<19073745>>దాడి<<>>తో మరోసారి ఇస్లామిక్ స్టేట్(ISIS) పేరు చర్చనీయాంశమవుతోంది. 2014-2017 మధ్య సిరియా, ఇరాక్‌లో అతి దారుణమైన దాడులతో ప్రపంచాన్ని భయపెట్టిందీ సంస్థ. కానీ US దాడులు, దాని చీఫ్ అబు బకర్ బగ్దాదీ హతమవడంతో పతనమైంది. ప్రస్తుతం సిరియా, ఇరాక్, అఫ్గాన్, పాక్‌తోపాటు పలు దేశాల్లో ఉనికిలో ఉంది. దీని నాయకత్వం రహస్యంగా ఉంది. తరచూ దాడులు చేస్తోంది. ఇటీవల <<18561798>>సిడ్నీలో దాడి<<>> చేసింది కూడా IS సానుభూతిపరులే.

News February 7, 2026

వెండితెరపై తండ్రీకూతుళ్ల జోరు!

image

సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ తండ్రీకొడుకుల కాంబోలు చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 2026లో తండ్రీకూతుళ్ల జోరు సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత ‘మన శంకర వరప్రసాద్ గారు’తో నిర్మాతగా సత్తా చాటగా గుణశేఖర్ కుమార్తె నీలిమ ‘యుఫోరియా’ను నిర్మించారు. రవితేజ డాటర్ మోక్షద ‘ఇరుముడి’ నిర్మాణ బాధ్యతలు చూస్తుంటే నటుడు అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ‘సీతా పయనం’ను తెరకెక్కిస్తున్నారు.