News August 30, 2025

వంగ పంటలో వెర్రితెగులు లక్షణాలు

image

పచ్చదోమ వల్ల ఇది వ్యాపిస్తుంది. మొక్క ఆకులు సన్నగా మారి, పాలిపోయి, చీపురు కట్టలా కనిపిస్తూ.. పూత, కాత ఉండదు. ఇలాంటి మొక్కలను పీకి నాశనం చేయాలి. మొక్క నాటడానికి వారం ముందు 250 గ్రా. కార్బోఫ్యూరాన్ 3CG గుళికలను 100 చ.మీ. నారుమడికి వేయాలి. వీటినే నారు నాటిన 2 వారాల తర్వాత ఎకరాకు 8 KGల చొప్పున వేయాలి. నాటిన 4-5 వారాల తర్వాత డైమిథోయేట్ 2mlను లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేయాలి.

Similar News

News February 2, 2026

గుడ్‌న్యూస్: ఫాస్టాగ్ వాడుతున్నారా?

image

FASTag యాక్టివేషన్ సమయంలో వాహన వివరాలను ధ్రువీకరించే పూర్తి బాధ్యతను బ్యాంకులకే అప్పగించింది NHAI. ఇప్పటివరకు వాహన యజమానులు ఫాస్ట్‌ట్యాగ్ పొందిన తర్వాత KYV పూర్తి చేసుకోవాల్సి ఉండేది. దీంతో యాక్టివేషన్ ఆలస్యం కావడం, రిఫండ్స్ రాకపోవడం వంటి సమస్యలు వచ్చేవి. కొత్త విధానంలో బ్యాంకులు ముందుగానే వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరిస్తాయి. దీంతో FASTag జారీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

News February 2, 2026

కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నం: మంత్రి నిమ్మల

image

AP: సీఎం చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దారుణం అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వాటిని ఎవరూ సహించరని.. జగన్ డైరెక్షన్‌లోనే అంబటి అలా మాట్లాడారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాపుల గురించి ముద్రగడ మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు.

News February 2, 2026

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

<>టాటా<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ 11 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ(MCom)అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు రూ.125. నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tiss.ac.in